రివ్యూ : ఆర్ఆర్ఆర్ – కుంభ‌స్థ‌లం బద్దలుకొట్టింది

నటీనటులు : రామ్ చరణ్ , ఎన్టీఆర్ , అలియా భట్ , శ్రీయ , అజయ్ దేవగన్ తదితరులు
డైరెక్టర్ : రాజమౌళి
మ్యూజిక్ డైరెక్టర్ : కీరవాణి
నిర్మాత : దానయ్య
తెలుగుమిర్చి రేటింగ్ : 3.75/5
విడుదల తేదీ : మార్చి 25 , 2022

ఎక్కడ చూసినా..ఎక్కడ విన్న ఒకే ఒక మాట ఆర్ఆర్ఆర్..ఆర్ఆర్ఆర్. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఈ రోజు (మార్చి 25) తెల్లవారు జామునుంచే ఈ సినిమా స్పెషల్ షోస్ పడ్డాయి. అంతకంటే ముందే యూఎస్‌లో ప్రీమియర్స్ షోస్ పడ్డాయి. ఓవరాల్‌గా ఈ సినిమా అంచనాలకు మించే ఉందని టాక్ రావడం తో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. మరి ఈ మూవీ ఎలా ఉంది..? కథ ఏంటి..? హీరోలు ఎలా నటించారు..? రాజమౌళి డైరెక్షన్ ఎలా ఉంది..? సినిమా ప్లస్ , మైనస్ లు ఏంటి..? అనేవి ఇప్పుడు చూద్దాం.

కథ :

రామరాజు (రామ్ చరణ్) చిన్నప్పటి నుండి పోలీస్ కావాలనే కల. ఆ కలను నెరవేర్చుకుంటాడు. బ్రిటిష్ ప్రభుత్వంలో పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తుంటాడు. కాగా బ్రిటిష్ గవ‌ర్న‌ర్ స్కాట్ దొర (రే స్టీవెన్‌స‌న్‌) త‌న ఫ్యామిలీ తో కలిసి ఆదిలాబాద్‌ ప్రాంతాన్ని సంద‌ర్శించిన‌ప్పుడు, అక్క‌డ గోండు జాతికి చెందిన మ‌ల్లి అనే చిన్నారిని వాళ్ల‌తో పాటే ఢిల్లీ కి తీసుకెళతారు. ఇది అన్యాయమని ఎదిరించిన కుటుంబాన్ని హింసిస్తారు. గోండు జాతికి కాప‌రిలాంటి భీమ్ (ఎన్టీఆర్‌) మ‌ల్లిని తీసుకు రావ‌డం కోసం ఢిల్లీ కి ప‌య‌న‌మ‌వుతాడు. ఈ విషయం తెలుసుకున్న స్కాట్ దొర..భీమ్ ను అరెస్ట్ చేయాల్సిన బాధ్యత రామరాజు కు అప్పగిస్తాడు. అప్పటివరకు తన చిన్ననాటి స్నేహితుడే భీమ్ అనే విషయం తెలియదు..మరోపక్క సీతారామరాజు బ్రిటిష్ ప్రభుత్వంలో పనిచేసే పోలీస్ అని భీమ్ కు తెలియదు. మరి ఇద్దరికీ ఒకరి గురించి ఒకరికి తెలిసిన తర్వాత ఏంజరుగుతుంది..? భీమ్ మల్లిని తీసుకెళ్తాడా..లేదా..? భీమ్ ను రామరాజు అడ్డుకుంటాడా ..లేదా..? ఈ ఇద్దరి మధ్య ఎలాంటి యుద్ధం జరుగుతుంది..? అనేది అసలు కథ.

ప్లస్ :

  • చరణ్ – ఎన్టీఆర్ నటన
  • రాజమౌళి డైరెక్షన్
  • యాక్షన్ సన్నివేశాలు
  • నిర్మాణ విలువలు
  • కీరవాణి బ్యాక్ గ్రౌండ్

మైనస్ :

  • సెకండ్ హాఫ్ రన్ టైం
  • చరణ్ – అలియా లవ్ ట్రాక్

నటీనటుల తీరు :

  • ఎన్టీఆర్ – చరణ్ లు ఇద్దరు కూడా ఎక్కడ తగ్గలేదు. నువ్వా..నేనా అన్నట్లు నటించారు. యాక్షన్ సన్నివేశాల్లో చించేశారు. అలాగే నాటు నాటు సాంగ్ లో అదిరిపోయే స్టెప్స్ తో కుమ్మేసారు.
  • అలియాభ‌ట్‌ రోల్ చిన్నదే అయినప్పటికీ సినిమాలో కీలకమైంది.
  • అజయ్ దేవగన్ – శ్రీయ – సముద్ర ఖని మోదకాలు వారు వారి వారి పరిధి మేరకు బాగానే చేసారు.

సాంకేతిక వర్గం :

  • ఎం.ఎం.కీర‌వాణి సంగీతం నేప‌థ్య సంగీతం, పాట‌లు సినిమాకి ప్రాణం పోశాయి.
  • సెంథిల్ కెమెరా ప‌నిత‌నం మరోసారి రుజువైంది. ప్రతి సన్నివేశాన్ని చాలా గ్రాండ్‌ లుక్‌లో చూపించారు. రాజమౌళి కన్న కలను తెరపై అద్భుతంగా ఆవిష్కరించారు.
  • ప్రొడక్షన్‌ డిజైనర్‌ సాబు శిరిల్‌. సెట్స్‌ చాలా గ్రాండ్‌గా ఉన్నాయి.
  • పాత్రల కోసం రమా రాజమౌళి ఎంపిక చేసిన కాస్ట్యూమ్స్‌ ఆ పాత్రలను తెరపై మరింత సహజంగా కనిపించేలా చేశాయి.
  • బుర్రా సాయిమాధ‌వ్ డైలాగ్స్ థియేటర్స్ లలో ఈలలు వేయించాయి.
  • కొమ‌రం భీమ్‌, అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌ల‌తో ముడిపెడుతూ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ ఈ క‌థ‌ని అల్లిన తీరు మెప్పిస్తుంది.
  • ఇక డైరెక్టర్ రాజమౌళి మరోసారి తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటిచెప్పారు. ఇద్దరు అగ్ర హీరోలను ఎంపిక చేసుకొని..వారి పాత్రలు సమానంగా ఉండేలా తెరకెక్కించి అభిమానులను మెప్పించారు. ప్రతి సన్నివేశం కూడా రోమాలు నిక్కబొడుచుకునేలా చేసాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ సన్నివేశం నా భూతో నా భవిష్యత్ అనేలా ఉంది.

ఓవరాల్ గా : ఆర్ఆర్ఆర్ కుంభ‌స్థ‌లం బద్దలుకొట్టింది