ఐటెం సాంగ్ కు అదిరిపోయే రిప్లయ్ ఇచ్చిన ఆర్ఆర్ఆర్ యూనిట్

రాజమౌళి డైరెక్షన్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్, అలియా భట్, ఒలివియా మోరిస్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, సముద్రకని, రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ సహాయక పాత్రలు నటిస్తున్న మూవీ ఆర్ఆర్ఆర్. ప్రస్తుతం ఈ పాన్ ఇండియా మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. సంక్రాంతి కానుకగా జనవరి 07 న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్ల ఫై దృష్టి సారించారు.

నిన్న జననీ సాంగ్ విడుదల చేసి ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో ‘ఆర్ఆర్ఆర్’ టీంకు నెటిజన్ కు మధ్య సోషల్ మీడియాలో జరిగిన ఫన్నీ కన్వర్జేషన్ అందరి సృష్టిని ఆకర్షిస్తోంది. అందరూ సోషల్ మీడియా ద్వారా ‘జననీ’ సాంగ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తుంటే ఓ నెటిజన్ మాత్రం వెరైటీగా స్పందించాడు. “ఐటమ్ సాంగ్ ఉందా మావా ?” అంటూ ‘ఆర్ఆర్ఆర్’ టీంను ట్యాగ్ చేశాడు. దానికి బ్రహ్మానందం ఫోటోను యాడ్ చేశాడు. ‘ఆర్ఆర్ఆర్’ మేకర్స్ కూడా అంతే కూల్ గా ‘ఏ నువ్వు చేస్తావా ?” అంటూ ప్రశ్నించారు. వీళ్ళు కూడా దానికి బ్రహ్మానందం ఫన్నీ ఎక్స్ప్రెషన్ ను జోడించడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం నెటిజన్, ‘ఆర్ఆర్ఆర్’ టీం మధ్య జరిగిన ఈ సరదా సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.