అక్కినేని కాంపౌండ్‏లో అడుగుపెట్టిన సామ్

నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత మొదటి సారి అక్కినేని కాంపౌండ్‏లో అడుగుపెట్టింది. విడాకుల అనంతరం తీర్థయాత్రలు చేపట్టిన సామ్..ప్రస్తుతం సినిమాల ఫై ఫోకస్ చేసింది. గతంలో మాదిరిగా గ్లామర్ పాత్రలకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. రీసెంట్ గా పుష్ప లో ఐటెం సాంగ్ కు పచ్చ జెండా ఊపిన ఈ బ్యూటీ..బాలీవుడ్ లోను నటించడానికి ఓకే చెప్పింది. మంచి కథ వస్తే తప్పకుండా నటిస్తానని తెలిపింది.

ఇక అక్కినేని కాంపౌండ్‏లో అడుగుపెట్టడానికి కారణం ఆమె నటించిన శాకుంతలం మూవీనే. డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా డబ్బింగ్ వర్క్ పూర్తి చేసేందుకు సామ్ అన్నపూర్ణ స్టూడియోకు వెళ్లిందట. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే… నాగచైతన్య పుట్టినరోజున సామ్ విషెస్ చేయకుండా.. తన కుక్క పిల్లకు బర్త్ డే వేడుకలు జరపడం పై చై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.