దసరా సందర్భాంగా సమంత ఏ గుడ్ న్యూస్ చెపుతుందో..?

నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న సమంత..ప్రస్తుతం ఫోకస్ అంత సినిమాల ఫై పెట్టింది. పెళ్లి తర్వాత గ్లామర్ పాత్రలకు నో చెప్పడం తో చాల ఛాన్సులు మిస్ అయ్యాయి. ఇక ఇప్పుడు విడాకులు తీసుకోవడంతో దర్శక ,నిర్మాతలు ఆమెకు కథలు వినిపించే పనిలో పడ్డారు.

ఈ క్రమంలో రేపు దసరా సందర్భాంగా సామ్..ఓ కొత్త కబురు చెప్పుతున్నట్లు ఫిలిం నగర్ లో ప్రచారం జరుగుతుంది. మరి అది కొత్త సినిమా తాలూకా న్యూసా…లేక మరోటా అనేది చూడాలి. ప్రస్తుతమైతే..స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘శాకుంతలం’ మూవీని కంప్లీట్ చేసి చెన్నై లో ఉంది. అక్కడ విజయ్ సేతుపతి, నయనతారలతో కలిసి ఓ మల్టీస్టారర్ మూవీ షూటింగ్‌లో పాల్గొంటుంది.