Site icon TeluguMirchi.com

సమంత మనసు తెలియక వెంటపడుతుంటారట..

నాగ చైతన్య తో పెళ్లి తర్వాత సమంత క్రేజ్ ఇంకాస్త పెరిగింది..అక్కినేని కోడలిగా, అలాగే వరుస పెట్టి హిట్స్ తన ఖాతాలో వేసుకుంటూ ఉండడం తో అంత సమంత పేరునే జపం చేస్తున్నారు. ఇక సామ్ సైతం సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులేస్తోంది. మూసకథలు కాకుండా ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగేలా ఉండేలా చూసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే దర్శకురాలు నందిని రెడ్డి చెప్పిన ఓ కథ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

ఓ కొరియన్ ఫిల్మ్ ఆధారంగా ఈ సినిమా కథను సిద్ధం చేసిందట నందిని. ఈ సినిమాలో సమంతది వైవిధ్యమైన పాత్ర అని అంటున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియనప్పటికీ , ఫిలిం సర్కిల్లో మాత్రం కొంత సమాచారం బయటకొచ్చింది. ఈ సినిమాలో సమంత చూడడానికి యంగ్ గా, అందంగా వుంటుందని, కానీ వయసు, మనసు మాత్రం ఓల్డ్ ఏజ్ ఫీల్ తో వుంటాయని అంటున్నారు. ఆమె మనసు తెలియక, కేవలం అందం చూసి అబ్బాయిులు వెంటబడడం లాంటి వ్యవహారం వుంటుందట.

ఇక ఇందులో నాగశౌర్య ఓ 20 నిముషాలు కనిపిస్తాడని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా తాలూకా వివరాలను తెలియజేస్తారని వినికిడి.

Exit mobile version