Site icon TeluguMirchi.com

ఎన్టీఆర్‌తో కష్టం అంటున్న సమంత

samantha with jr
ఎన్టీఆర్ సినిమా అంటే డాన్సులు అదిరిపోవాల్సిందే. వంటిని తీగ‌లా మార్చి మెలిక‌లు తిరిగిపోయే ఎన్టీఆర్‌ని చూసి అంద‌రూ వారెవా అనాల్సిందే. టాలీవుడ్‌లో బెస్ట్ డాన్సర్ ఎవ‌రూ….? అని అడిగితే ఎన్టీఆర్ పేరే చెబుతారు ఎక్కువ మంది. అందుకే ప్ర‌తీ సినిమాలోనూ త‌న డాన్సులు కొత్త‌గా ఉండాల‌ని ట్రై చేస్తుంటాడు ఎన్టీఆర్‌. అయితే ఇదే సందర్భంలో ఆయన స్పీడ్ అందుకోలేక తెగ హైరానా పడుతుంటారు హీరోయిన్స్. సమంత కూడా ఇలా భయపడిపోయే బాపతే. ఈ విషయాన్ని స్వయంగా సమంతనే వెల్లడించింది.

‘ఎవరితో డ్యాన్స్ చేయడం కష్టంగా భావిస్తారు?’తాజాగా సమంత ట్విట్టర్ లైవ్ చాట్ లో వున్నపుడు ఓ అభిమాని వేసిన ప్రశ్నఇది . దీనికి మరో ఆలోచన లేకుండా ఎన్టీఆర్ అని సమాధనం ఇచ్చింది సమంత. ఎన్టీఆర్ తో డ్యాన్స్ అంటే వళ్ళు హూనం అయిపోవల్సిందే. ఎన్టీఆర్ మూమెంట్స్ ను అందుకోవడం కష్టం. అయితే మొత్తమ్మీద ఏదోలా కష్టపడి పాట ఫినిష్ చేస్తుంటా’అని అంటోందీ చెన్నయ్ భామ. ఎన్టీఆర్-సమంత కలయికలో బృందావనం, రామయ్య, రభస చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘జనతా గ్యారేజ్’ లో కూడా ఈ జంటే సందడి చేయనుంది.

Exit mobile version