Site icon TeluguMirchi.com

80 కిలోలని సామ్ ఎంత ఈజీ గా ఎత్తేసిందో..

నటి సమంత జిమ్ లో ఎక్కువగా గడుపుతుంటుందనే సంగతి తెలిసిందే. గ్లామర్ తో పాటు ఫిట్నెస్ విషయంలో చాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది. తన బరువు ను ఏమాత్రం పెరగకుండా కష్టపడుతూ..ఆ కష్టాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఉంటుంది. తాజాగా 80 కిలోల బరువును చాలా ఈజీ గా ఎత్తేసి వార్తల్లో నిలిచింది.

తాజాగా తన ఫిట్‌నెస్ ట్రైనర్ జునైద్‌‌తో కలిసి బరువులెత్తుతున్న వీడియోను సమంత తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. వెయిట్ లిఫ్టింగ్ లో 75 కిలోల నుంచి బరువు ఎత్తడం మొదలు పెట్టింది. ఆ తర్వాత 78 కిలోల బరువు ఉన్న వెయిట్ లిఫ్ట్ ని లేపింది. ఆ తర్వాత 80 కిలోల బరువుని కూడా సునాయాసంగా లేపింది. ఈ వీడియో చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు.

@Samanthaprabhu2! 😮🔥🔥 #Samantha #SamanthaRuthPrabhu pic.twitter.com/7eKHH2dgCu— Troll Who Trolls Samantha™ (@TeamTWTS) January 14, 2022

Exit mobile version