Site icon TeluguMirchi.com

సానియా తో రామ్ చరణ్ స్టెప్పులు..

టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా సోదరి ఆనం మీర్జా వివాహ వేడుక అంగరంగా జరిగింది. టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ తనయుడు అసద్ తో గత కొని రోజులుగా ప్రేమాయణం సాగిస్తున్న ఆనం మీర్జా.. బుధవారం రాత్రి పెళ్లి చేసుకొని ఒకటయ్యారు. ఇరు కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య ఈ వివాహం జరిగింది.

కేవలం దగ్గరి బంధువులను సన్నిహితులను మాత్రమే ఈ వివాహానికి ఆహ్వానించారు. మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్ భార్య ఉపాసన టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకి మంచి స్నేహితురాలు. అందుకే వీరు కూడా ఈ వివాహానికి హాజరయ్యారు. ఈ వివాహ వేడుకలో చరణ్ – సానియా డాన్సులు వేసిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో రామ్ చరణ్ తో పాటు సానియా మీర్జా మరియు దర్శకురాలు ఫరా ఖాన్ లు డాన్స్ చేస్తున్నారు. ఈ వీడియో ను ఉపాసన తన ట్విటర్ ద్వారా పోస్ట్ చేసింది.

Exit mobile version