మహేష్ , త్రివిక్రమ్ మూవీ లో సంజయ్ దత్ ?

ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కలయికలో #ఎన్టీఆర్30 తెరకెక్కనుందని సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరిగింది, అయితే ఏమైందో ఏమో తెలీదు కానీ అనూహ్యంగా #ఎన్టీఆర్30 చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. ఎన్టీఆర్ కోసం రెడీ చేసిన కథనే మహేష్ బాబు కి వినిపించగా ఓకే చేసినట్లు సమాచారం. సమకాలీన రాజకీయాలపై ఈ చిత్రం ఉండనున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ చిత్రంలో ఒక ప్రధాన పాత్ర కోసం సంజయ్ దత్ ని బరిలోకి దింపుతున్నాడట డైరెక్టర్ త్రివిక్రమ్. ఇదే నిజమైతే సినిమా సూపర్ హిట్ ఔతుందనడంలో సందేహం లేదు.