సర్కారు వారి పాట లాస్ట్ సాంగ్ షూటింగ్ స్టార్ట్


సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట’ షూటింగ్ చివరి దశలో ఉంది. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఆర్‌ఎఫ్‌సిలో జరుగుతోంది. షూటింగ్ లో బాగంగా ఒక మాస్ సాంగ్ ని భారీ సెట్ లో చిత్రీకరిస్తున్నారు. దీంతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ప్రస్తుతం మహేష్ బాబు, కీర్తి సురేష్ , డ్యాన్సర్లపై చిత్రీకరిస్తున్న పాట మాస్ సాంగ్ గా ఉండబోతుంది. శేఖర్ మాస్టర్ ఈ పాటకి కొరియోగ్రఫీ చేస్తున్నారు. షూటింగ్ లో బాగంగా యూనిట్ లొకేషన్ స్టిల్స్ ని విడుదల చేశారు. కాళ్ళకి రెడ్ కర్ట్చీప్ కట్టుకొని మహేష్ చాలా మాస్ గా ఇందులో కనిపించారు.