పెళ్లిపీటలు ఎక్కబోతున్న శర్వానంద్


తెలుగు సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌లలో ఒకరైన నటుడు శర్వానంద్ త్వరలో తన బ్యాచిలర్‌హుడ్‌కి వీడ్కోలు పలుకనున్నారు. త్వరలోనే తన తల్లిదండ్రులు చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. దివంగత రాజకీయ నాయకుడు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మనవరాలితో కలిసి ఆయన ఏడడుగులు నడవనున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఈమె యుఎస్‌లో టెక్కీగా విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా వీరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి.

ఇక ఇరు కుటుంబాల పెద్దలు ఈ నెల 26న నిశ్చితార్థం ఫిక్స్ చేశారు. రెండు కుటుంబాల బంధువులు మరియు కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ నిశ్చితార్థం జరగనుంది. పెళ్లి ముహూర్తం మాత్రం సమ్మర్ తర్వాతే. వేదికను కూడా రానున్న రోజుల్లో ఖరారు చేయనున్నారు. మొత్తానికి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌లలో ఒకరైన శర్వా కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు.