ఒక మ్యాగజైన్ కోసం బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నగ్నంగా ఫోటోషూట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై నెట్టింట్లో తీవ్ర దుమారం రేగుతుంది. తాజాగా నటి, మోడల్ షెర్లన్ చోప్రా ఈ విషయమై రణ్వీర్ భార్య దీపికా పదుకొణేను టార్గెట్ చేసింది. నేను గతంలో ఒక అవార్డు ఫంక్షన్‌కు వేసుకున్న డ్రెస్ చూసి దీపికా నన్ను అసహ్యించుకుంది. అప్పుడు నా ఒంటిపై కనీసం బట్టలైనా ఉన్నాయి. నీ భర్తలా నగ్నంగా అయితే ఫోటోలు దిగలేదు అని చెప్పింది. నేను కూడా గతంలో ఒక మ్యాగజైన్ కోసం బోల్డ్‌గా ఫోటోషూట్ చేస్తే అందరూ నా క్యారెక్టర్‌ను తప్పుపట్టారు. మరి ఇప్పుడు రణ్వీర్ను ఎందుకు ఎమీ అనడం లేదు. సమాజం కూడా ఇలా పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తుందో తెలియడం లేదంటూ అసహనం వ్యక్తం చేసింది.