Site icon TeluguMirchi.com

టెంపర్ చూపించలేకపోయిన సింబా..

ఎన్టీఆర్ – పూరి కాంబినేషన్లో 2015 లో వచ్చిన చిత్రం టెంపర్. అప్పటి వరకు ప్లాప్ లతో ఇబ్బంది పడుతున్న ఎన్టీఆర్ కు ఈ చిత్రం బూస్ట్ ఇచ్చినట్లు అయ్యింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ నటన కు ఫిదా కానివారు లేదు. అభిమానుల దగ్గరి నుండి సినీ ప్రముఖుల వరకు అంత ఎన్టీఆర్ నటన గురించి చాల గొప్పగా చెప్పారు.

ఇక ఈ చిత్రాన్ని హిందీ లో సింబా గా రీమేక్ చేసారు. రోహిత్ శెట్టి డైరెక్ట్ చేయగా , రణ్వీర్ సింగ్, సారా అలీఖాన్, సోనూసూద్, ప్రకాష్ రాజ్, వైదేహి తదితరులు నటించారు. ఈ సినిమా ఈరోజు వరల్డ్ వైడ్ గా విడుదల అయ్యింది. ఈ సినిమా చూసిన వారంత టెంపర్ మాదిరిగానే ఉందని చెపుతున్నారు. కాకపోతే ఎన్టీఆర్ సినిమా మొత్తం సీరియస్ గా ఉంటె రణ్వీర్ మాత్రం తన మార్క్ కామెడీని మిక్స్ చేసి, సీరియస్ సీన్స్ లో సైతం కామెడీ చేయడం.. మధ్యమధ్యలో డ్యాన్స్ చేయడం వంటివి చేసాడని చెపుతున్నారు. అక్కడక్కడా చిన్న చిన్న మార్పులు తప్పించి సినిమా దాదాపుగా టెంపర్ ను హిందీలో డబ్ చేసినట్టుగానే ఉందని అంటున్నారు.

Exit mobile version