Site icon TeluguMirchi.com

ప్రమాదం తప్పింది..!!

sravana bharagaviసినీ నేపథ్య గాయని శ్రావణ భార్గవి పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది. తను ప్రయాణిస్తున్న కారును.. రాంగ్ రూట్ లో వస్తోన్న ట్రాక్టర్ ఢీకొట్టబోయింది. అప్రమత్తమైన డ్రైవర్.. ప్రమాదం నుంచి తప్పించే ప్రయత్నం చేశారు. అది కాస్త అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. అదే సమయంలో.. అదృష్టం కొద్ది కారు టైర్ పగిలిపోవడంతో.. కారు అక్కడికక్కడే నిలిచిపోయింది. దీంతో.. పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన నల్గొండ చిట్యాల శివారులోని జాతీయ రహదారిపై జరిగింది. విజయవాడలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు శ్రావణభార్గవి వెళుతోంది. అనంతరం ఆమె భర్త సింగర్ హేమచంద్ర ఘటన స్థలానికి చేరుకొని శ్రావణ భార్గవిని మరో కారులో విజయవాడకు చేర్చారు. టైర్ గాడ్ తో.. ప్రమాదం తప్పిందని శ్రావణ భార్గవి ఊపిరిపీల్చుకుందట.

Exit mobile version