Single : శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘#సింగిల్’ సినిమా ట్రైలర్ విడుదలైంది. గీతా ఆర్ట్స్ మరియు కళ్యా ఫిల్మ్స్ బ్యానర్లపై నిర్మితమైన ఈ హోల్సమ్ ఎంటర్‌టైనర్‌కి కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. కేతిక శర్మ, ఇవానా కథానాయికలుగా నటిస్తుండగా, వెన్నెల కిషోర్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ట్రైలర్ ఓ హ్యూమరస్ నోట్‌తో మొదలై, యూత్‌ను ఆకట్టుకునేలా కామెడీ, రొమాన్స్, మాస్ యాటిట్యూడ్ మేళవింపుతో సాగుతుంది. “గుడ్ బాయ్”, “బ్యాడ్ బాయ్ యాటిట్యూడ్”, “మాస్ వాయిస్” వంటి మూడు గోల్డెన్ టిప్స్ ద్వారా ప్రేమను సాధించాలన్న శ్రీ విష్ణు పాఠాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
ఈ చిత్రంలో శ్రీ విష్ణు తన ప్రత్యేకమైన కామిక్ టైమింగ్‌తో మరోసారి ప్రేక్షకులను మెప్పించాడు. కేతిక శర్మ, ఇవానా పాత్రలు ఫ్రెష్‌గా అనిపిస్తుండగా, వెన్నెల కిషోర్ డైలాగ్ డెలివరీ సినిమాకు హ్యూమర్‌ని మరింత ఎలివేట్ చేసింది. ఆర్.వేల్‌రాజ్ సినిమాటోగ్రఫీ, విశాల్ చంద్రశేఖర్ సంగీతం సినిమాకి రిచ్ టోన్‌ను కలిగించాయి. గీతా ఆర్ట్స్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రం మే 9న థియేటర్లలో విడుదల కాబోతుంది. ట్రైలర్‌కు వచ్చిన స్పందనతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
‘#సింగిల్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మాట్లాడుతూ, “తండేల్ లాంటి సీరియస్ ఎమోషనల్ లవ్ స్టోరీ తర్వాత, నవ్వులు పూయించే సరదా కథ చేయాలని కోరుకున్నా. అప్పుడు భాను, రియాజ్ ‘సింగిల్’ కథను తీసుకొచ్చారు. దర్శకుడు కార్తీక్ రాజు ఈ కథ చెప్తున్న రెండు గంటల పాటు నేను పగలబడి నవ్వుతూనే ఉన్నాను. శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్‌ల కామెడీ టైమింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇది ఫ్యామిలీ అంతా కలిసి నవ్వుకునే, హాయిగా ఆస్వాదించే సూపర్ ఫన్ ఎంటర్టైనర్. మే 9న విడుదల కానున్న ఈ చిత్రం వేసవికి పర్ఫెక్ట్. డి.ఓ.పీ వేల్‌రాజ్ సినిమాను అద్భుతంగా చిత్రీకరించగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం సినిమాకు హ్యూమర్ టోన్‌ను బలపరిచింది. ట్రైలర్‌లోని కాక్రోచ్ థియరీకి ఎవరు అపార్థం చేసుకోవద్దు. అది జీవుల రెజిలియన్స్ గురించి చెప్పే ఉదాహరణ మాత్రమే. ఈ సినిమా సమ్మర్‌లో అందరినీ కూల్‌గా ఉంచుతుంది” అన్నారు.
హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ, “ఇంటిళ్లపాదిని కడుపుబ్బ నవ్వించాలనే ఉద్దేశంతో ఈ సినిమాను చేశాం. మంచి టీమ్ వెన్నెల కిషోర్, కేతిక, ఇవానా అందరూ కలసి నవ్వుల పండుగ తీసుకువచ్చారు. సినిమా స్క్రీన్‌ప్లే, కథ కొత్త అనుభూతిని ఇస్తుంది. మే 9న థియేటర్లలో సినిమా విడుదలవుతుంది. తప్పకుండా వెళ్లి చూడండి. హ్యాపీగా నవ్వుకుంటారు, పిచ్చిపిచ్చిగా ఎంజాయ్ చేస్తారు” అన్నారు.