అక్షయ్ తో సుక్కు మూవీ..

పుష్ప తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ సుకుమార్..తన బాలీవుడ్ సినిమా విశేషాలను మీడియా తో పంచుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో అక్షయ్ కుమార్ ‘పుష్ప’ సినిమా షూటింగ్ సమయంలో ఫోన్ చేసి ‘మనం సినిమా చేద్దాం. ముంబై వచ్చేయండి అన్నారు’ అని తెలిపినట్లు చెప్పుకొచ్చాడు.

బాలీవుడ్‌లో సినిమా చేసే ఆలోచనలో నేనూ ఉన్నాను..అక్కడ గనక సినిమా చేస్తే ముందు అక్షయ్‌తోనే ఉంటుంది..సరైన స్క్రిప్ట్ కుదిరితే ఖచ్చితంగా ఆయనతోనే చేస్తానని సుకుమార్ ఇటీవల ఓ ఇంటర్యూలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సుకుమార్ పుష్ప పార్ట్ 2 ఫై ఫోకస్ పెట్టాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టనున్నాడు. ఈ సిరీస్‌ను మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. దేవీశ్రీప్రసాద్ సంగీత దర్శకుడు.