తండ్రి పేరిట స్కూల్ నిర్మించిన సుకుమార్..ఈరోజే ఓపెనింగ్

రంగస్థలం ఫేమ్ సుకుమార్ టాలీవుడ్ లో అగ్ర దర్శకుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన..సామజిక సేవ చేయడంలోను ముందుంటారు. కరోనా కష్ట కాలంలో తన సొంతూరిలో సొంతంగా ఖర్చు చేసి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ – ఆక్సిజన్ సిలిండర్స్‌ని పంపిణీ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఇక ఇప్పుడు తన తండ్రి బండ్రెడ్డి తిరుపతిరావు నాయుడు గారి పేరిట తన స్వగ్రామం మట్టపర్రులో నిర్మించిన ఓ పాఠశాల ప్రారంభోత్సవానికి ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి హాజరుకాబోతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం బన్నీ తో పుష్ప మూవీ చేస్తున్నాడు.