సుమంత్ రెండో పెళ్లి చేసుకోవడం లేదట..

గత మూడు రోజులుగా హీరో సుమంత్ రెండో పెళ్లికి సిద్ధమయ్యాడని..పవిత్ర అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని మరోసారి ఓ ఇంటివాడు కాబోతున్నాడనే వార్తలు సోషల్ మీడియా లో వైరల్ కావడం తో అంత నిజమే అనుకోని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అయితే ఈ వార్తల ఫై సుమంత్ క్లారిటీ ఇచ్చాడు.

తాను రెండో పెళ్లి చేసుకోవడం లేదని స్పష్టం చేశారు. ‘‘నిజ జీవితంలో నేను మళ్లీ పెళ్లి చేసుకోవడం లేదు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన శుభలేఖ ప్రస్తుతం నేను నటిస్తున్న సినిమాకు సంబంధించింది. పెళ్లి, విడాకులు నేపథ్యంలో సాగే సినిమా అది. ఆ షూటింగ్‌ నుంచి వెడ్డింగ్‌ కార్డ్‌ లీకైంది. త్వరలో ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ విడుదల చేస్తాం’’ అని తెలిపారు.