ఈ సమ్మర్ లో కూడా సినిమాలు లేనట్లేనా ?

వేసవి సెలవులంటే తెలుగు చలన చిత్ర పరిశ్రమకు కాసులు కురిపించే రోజులు. సంక్రాంతి తర్వాత నిర్మాతలు ఎక్కువగా ఇష్టపడే సీజన్‌ సమ్మరే. కానీ కరోనా కారణంగా గత ఏడాది సమ్మర్‌కి బాక్సాఫీసు కుదేలయింది. ఈ సమ్మర్‌కి అయినా సినిమాల సందడి ఉంటుందనుకుంటే సెకండ్‌ వేవ్‌ కారణంగా ఈసారీ నిరాశే మిగిలింది

ఇప్పటికే మే నెలలో విడుదలకు షెడ్యూల్‌ అయిన చిరంజీవి ‘ఆచార్య’ (మే 13) , నాగచైతన్య ‘లవ్‌స్టోరీ’ (ఏప్రిల్‌ 16), నాని ‘టక్‌ జగదీష్‌’ (ఏప్రిల్‌ 23), కంగనా రనౌత్‌ ‘తలైవి’ (ఏప్రిల్‌ 23), రానా ‘విరాటపర్వం’ (ఏప్రిల్‌ 30) ఇప్పటికే అధికారికంగా వాయిదా పడ్డాయి. వెంకటేష్‌ ‘నారప్ప’ (మే 14), బాలకృష్ణ ‘అఖండ’ (మే 28), రవితేజ ‘ఖిలాడి’ (మే 28) చిత్రాలు విడుదల వాయిదా పడే అవకాశం ఉందని ఇండస్ట్రీ టాక్‌. ఇలా ఈ సమ్మర్‌ కూడా వెండితెరపై బొమ్మ పడకుండా ముగిసిపోయేలా ఉంది.