ఇండియాస్ ఫస్ట్ సూపర్ గర్ల్ సినిమా ‘ఇంద్రాణి’ మేకింగ్ వీడియో

భార‌త‌దేశపు మొట్ట‌మొద‌టి సూప‌ర్ గ‌ర్ల్ మూవీ `ఇంద్రాణి` షూటింగ్ ప్ర‌స్తుతం హైదరాబాద్ మరియు ప‌రిస‌ర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. వినూత్న త‌ర‌హాలో భారీ వీఎఫ్ఎక్స్‌తో తెర‌కెక్కుతోన్న‌ ఈ చిత్రం ద్వారా స్టీఫెన్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు…స్టాన్లీ సుమ‌న్ బాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. యానియా భ‌రద్వాజ్‌, క‌బీర్ దుహాన్‌ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 27న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళ భాషల్లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

2 సంవత్సరాలకు పైగా జ‌రిపిన ప్రీ-ప్రొడక్షన్ వ‌ర్క్, డీటైల్డ్ యాక్షన్ కొరియోగ్రఫీ, ప్రీ-విజువలైజేషన్‌తో VFX ప్లానింగ్ సినిమాను మ‌రింత‌ వేగంగా చిత్రీకరించడానికి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతున్నాయి. వీఎఫ్‌ఎక్స్‌, ఎడిటింగ్ ప‌నులు ఇప్పటికే స్టార్ట్‌ అయ్యి షూట్‌కి సమాంతరంగా జరుగుతున్నాయి.

యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నప్పుడు లీడ్ యాక్ట‌ర్స్‌ డెడికేషన్, రిస్క్ చూసి తాను స్టన్ అయ్యానని దర్శకుడు స్టీఫెన్ పేర్కొన్నారు. భారతీయ చరిత్రలో మహిళలు ఇంత పెద్ద స్థాయిలో రోప్ షాట్స్ మ‌రియు ఎంతో రిస్క్‌తో కూడిన కత్తుల‌ను ఉపయోగించి విన్యాసాలు చేసిన తొలి చిత్రం ఇంద్రాణి అని తెలిపారు. పార్ట్ 1 మేకింగ్ వీడియోను విడుదల చేసిన దర్శకుడు, రాబోయే వీడియోలలో మరిన్ని అద్భుతమైన యాక్షన్ స్టంట్‌లను విడుదల చేయనున్నట్లు తెలిపారు.

ఇంద్రాణి మొదటి మహిళా యాంటీ గ్రావిటీ మరియు జీరో-గ్రావిటీ ఫిల్మ్ అని మేకర్స్ పేర్కొన్నారు.