గని లో తమన్నా ఐటెం సాంగ్ ..

గద్దల కొండ గణేష్ గా ప్రేక్షకులను ఆకట్టుకున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం బాక్సింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కిరణ్‌ కొర్రపాటి-వరుణ్‌తేజ్‌ కాంబోలో వస్తోన్న ఈ చిత్రానికి గని అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను మార్చి 18 న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇదిలా ఉంటె ఈ మూవీ తాలూకా ఐటెం అప్డేట్ ఇచ్చి అభిమానుల్లో ఉత్సహం నింపారు.

ఈ సినిమాలో ”కొడితే” అంటూ సాగే ఐటెం సాంగ్‌ ను సంక్రాంతి రోజున 11.08 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అనౌన్స్‌ చేసింది. ఈ సాంగ్‌ లో మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తున్నట్లు ఓ పోస్టర్‌ ను కూడా వదిలింది చిత్ర బృందం.

అల్లు అర‌వింద్ స‌మ‌ర్పణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, బ్లూ వాట‌ర్ క్రియేటివ్ ప‌తాకాల‌పై సిద్ధు ముద్ద, అల్లు వెంక‌టేష్ (బాబీ) ఈ ‘గని’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వరుణ్ తేజ్ సరసన బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేక‌ర్ హీరోయిన్‌‌గా నటిస్తోంది. ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతిబాబు, నవీన్ చంద్ర ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.