Site icon TeluguMirchi.com

జార్జ్ రెడ్డి పై తమ్మా రెడ్డి కామెంట్స్

ఉస్మానియా క్యాంపస్ లీడర్, వామపక్ష విద్యార్థి సంఘం ప్రతినిధి, దివంగత జార్జిరెడ్డి జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న సినిమా జార్జ్ రెడ్డి’. ‘దళం’ సినిమా ఫేమ్ జీవన్ రెడ్డి దర్శకత్వం. సమ సమాజ స్థాపనే ధ్యేయంగా పోరాడి, లక్ష్య సాధనలో ప్రాణాలర్పించిన జార్జ్ రెడ్డి.. ఈ జనరేషన్‌కి తెలియకపోవచ్చేమో కానీ, 1965 నుంచి 1975 వరకు ఉస్మానియా యూనివర్శిటీలో చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఆయన జీవితం గురించి తెలుసు.

కాగా.. జార్జి రెడ్డి ఓ రౌడీ అంటూ కామెంట్లు చేస్తున్న నేపథ్యంలో అతనితో ప్రత్యక్ష పరిచయం ఉండి , కలిసి చదువుకున్న వ్యక్తిగా తమ్మారెడ్డి భరద్వాజ్ అనేక విషయాలను వెల్లడించారు. ఆయన హీరో అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన నమ్మిన సిద్దాంతాల కోసం చివరి వరకు నిలబడ్డాడు. వాటి కోసమే ప్రాణాలు కూడా వదిలాడు.” అన్నారు

Exit mobile version