ఆగష్టు 19 న రాబోతున్న తీస్ మార్ ఖాన్


వరుస డిఫరెంట్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ హీరో గా నటిస్తున్న చిత్రం తీస్ మార్ ఖాన్. RX 100 సినిమాతో ప్రేక్షకులకు పరిచయమై తన అందం అభినయంతో అందరిని మంత్ర ముగ్దులను చేసిన పాయల్ రాజ్ పుత్ ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తుంది. విజ‌న్ సినిమాస్ బ్యాన‌ర్‌పై నాగం తిరుప‌తి రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ హై యాక్షన్ వోల్టేజ్ చిత్రం ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకుల ఆదరణ పొందింది. తాజాగా ఈ చిత్రాన్ని ఆగష్టు 19 న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.