Site icon TeluguMirchi.com

షాకిచ్చారు.. !!

nayanatara-and-shi,buనయనతార, శింబు మాజీ లవర్స్ అన్న విషయం తెలిసిందే. అప్పుట్లో.. వీరి లవ్ స్టోరీ గురించి కోలీవుడ్ లో కథలు కథలుగా చెప్పుకునే వారు. విడిపోయిన అనంతరం కలసి నటించలేదు. ఎక్కడ ఎదురైనా.. ఎడమొహం పెడమొహమే. తాజాగా, కథ మారింది. ఇప్పుడు పాండిరాజన్ దర్శకత్వంలో.. ఇద్దరు కలసి నటిస్తున్నారు. నటిస్తున్నారు సరే.. మొదటి సారి సెట్ లో ఎలాపలకరించుకుంటారని యూనిట్ సభ్యుల ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒకనాటి ప్రేమికులు.. మళ్లీ కలుసుకునే తరుణం ఎలా వుండబోతుందన్నది వారి టెన్షన్. కానీ.. సెట్ లోకి వచ్చిన నయన్, శంబు హాయ్ హాయ్ అంటూ.. చిరునవ్వులు చిందిస్తూ.. షాకిచ్చారంట. పైగా.. షూటింగ్ గ్యాప్ లో గంటలకొద్ది బాతకాని కూడ కొట్టారంట. ఏం మాట్లాడుకున్నారంటారు..! ఏమో.. మళ్ళీ జతకట్టినట్లు.. మళ్లీ ప్రేమించుకుంటారేమో…

Exit mobile version