అజిత్ కి 24 గంటలు పట్టింది, విజయ్ నాలుగు గంటల్లోనే లేపేసాడు…


తల అజిత్ యాక్షన్ మోడ్ లోకి దిగి చేసిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘తునివు’. హెచ్.వినోద్ డైరెక్ట్ చేసిన ఈ మూవీపై కోలీవుడ్ భారి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో అజిత్ తన బాక్సాఫీస్ స్టామిన ఏంటో ప్రూవ్ చేస్తాడని అజిత్ ఫాన్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ట్రేడ్ వర్గాలు కూడా తునివు సినిమా కోలీవుడ్ లో భారి కలెక్షన్స్ సాదించిన సినిమాల్లో ఒకటిగా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ అంచనాలని మరింత పెంచుతూ తునివు ట్రైలర్ రిలీజ్ అయ్యింది. గ్యాంబ్లర్ సినిమాలో అజిత్ ని గుర్తు చెయ్యడంలో తునివు ట్రైలర్ సక్సస్ అయ్యింది. గత పదేళ్లలో అజిత్ ని ఇంత యాక్టివ్ మోడ్ లో చూడలేదని, అజిత్ ఫాన్స్ ని తునివు ట్రైలర్ ని రిపీట్ మోడ్ లో చూసారు. దీంతో తునివు ట్రైలర్ 24 గంటల్లోనే 1.5 మిలియన్ లైక్స్ ని సాదించి యుట్యూబ్ లో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది.

24 గంటల్లో తునివు ట్రైలర్ సాదించిన డిజిటల్ రికార్డ్స్ చూసి ఇప్పట్లో ఏ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కూడా తునివు రికార్డ్స్ ని బ్రేక్ చెయ్యలేదు అనుకున్నారు కానీ నేనున్నా అంటూ వచ్చేసాడు దళపతి విజయ్. తెలుగు తమిళ భాషల్లో రూపొందిన విజయ్ ‘వారసుడు’ సినిమా కూడా జనవరి 11నే రిలీజ్ అవుతోంది. నిన్న ఈ మూవీ ట్రైలర్ ని మేకర్స్ లాంచ్ చేశారు. తెలుగు హిట్ సినిమాల టెంప్లెట్ తో వరసుడు సినిమా తెరకెక్కింది అని ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరికీ అనిపించి ఉంటుంది. తెలుగు ఆడియన్స్ కి పాత కంటెంట్ అయిన వారసుడు సినిమా ట్రైలర్ ని విజయ్ ఫాన్స్ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. విజయ్ స్టైలిష్ గా కనిపించడంతో పాటు, ట్రైలర్ చెప్పిన పంచ్ డైలాగ్స్ కూడా వర్కౌట్ అవ్వడంతో దళపతి అభిమానులు వారసుడు ట్రైలర్ కి రిపీట్ వ్యూస్ ఇస్తున్నారు. దీంతో కేవలం నాలుగు గంటల్లోనే వారసుడు ట్రైలర్ 1.5 మిలియన్ లైక్స్ ని సాదించింది. అజిత్ ‘తునివు’ ట్రైలర్ కి 24 గంటలు పట్టిన రికార్డ్ ని మేము కేవలం నాలుగు గంటల్లోనే లేపేసాం అంటూ విజయ్ ఫాన్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ట్రైలర్ కే ఫ్యాన్ వార్ ఈ రేంజులో ఉంటే ఇక సేమ్ డే రోజు రిలీజ్ అవుతున్న ఈ సినిమాలు ఫస్ట్ డే ఇంకెన్ని వివాదాలకి కేరాఫ్ అడ్రెస్ అవుతాయో చూడాలి.