Site icon TeluguMirchi.com

బాక్సర్ లో ఉపేంద్ర..

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కెరియర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. కెరియర్ మొదట్లో కాస్త తడబడిన ప్రస్తుతం మాత్రం వరుస సక్సెస్ లతో ప్రేక్షకులకు కొత్తదనాన్ని అందిస్తున్నాడు. కేవలం కమర్షియల్ సినిమాలే కాకుండా విభిన్న కథలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దర్శక ,నిర్మాతలకు ఛాయస్ అవుతున్నాడు. గద్దలకొండ గణేష్ గా ప్రేక్షకులను అలరించిన వరుణ్..ప్రస్తుతం బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఓ కథ చేస్తున్నాడు.

కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కన్నడ నటుడు ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఉపేంద్ర గతంలో అల్లు అర్జున్‌తో కలిసి ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ చిత్రంలో నటించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. మరి ఈ బాక్సర్ లో ఉపేంద్ర కు ఎంత పేరు వస్తుందో చూడాలి. అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్దా, అల్లు వెంకటేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Exit mobile version