వకీల్ సాబ్ : మహేష్ బాబు రివ్యూ – పవర్ ప్యాక్డ్ పెరఫార్మన్సెస్

బాలీవుడ్ సూపర్ హిట్ ఫిలిం పింక్ చిత్రానికి రీమేక్ గా వచ్చిన వకీల్ సాబ్ చిత్రం. వేణు శ్రీ రామ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ ని దిల్ రాజు – బోనీకపూర్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. నిన్న (ఏప్రిల్ 9) వకీల్ సాబ్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకొని ఫస్ట్ డే కలెక్షన్స్ మోత మోగించింది.

తాజాగా మహేష్ బాబు సినిమా చూసి తన స్టైల్ లో రివ్యూ ఇచ్చేసాడు. పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ చాలా అద్భుతంగా ఉందన్నాడు. ప్రకాష్ రాజ్ లాయర్ పాత్రలో బ్రిలియంట్ గా నటించాడు. ముఖ్యంగా అంజలి, నివేత థామస్, అనన్య నాగళ్ళ నటన మనసుకు హత్తుకుంది. థమన్ బాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ అంటూ మొత్తం చిత్రం కాస్ట్ అండ్ క్రూ కి సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపాడు.