వకీల్ సాబ్ ట్విట్టర్ రివ్యూ

బాలీవుడ్ సూపర్ హిట్ ఫిలిం పింక్ చిత్రానికి రీమేక్ గా వస్తున్న వకీల్ సాబ్ చిత్రం పై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. వేణు శ్రీ రామ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ ని దిల్ రాజు – బోనీకపూర్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ రోజు(ఏప్రిల్ 9) వకీల్ సాబ్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది.

పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్ అదిరింది.ఇంటర్వెల్ సీన్ సినిమాకి హైలైట్ కానుంది. ఫస్ట్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కొంచెం స్లో గా ఉన్నా అది పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెసెన్స్ ముందు అంతలోపంగా కనపడదు. నివేత థామస్, అంజలి ఎక్సట్రార్డినరీ పెరఫార్మన్సుతో తమ పాత్రలలో జీవించేసారు. అనన్య స్క్రీన్ పై కొద్దిసేపు కనపడుతుంది, తన పాత్రకు తాను న్యాయం చేసింది. సెకండ్ హాఫ్ లో ప్రకాష్ రాజ్, పవన్ కళ్యాణ్ మధ్య డైలాగ్స్ చాల ఎమోషనల్ గా ఉంటాయి. మెట్రో ట్రైన్ ఫైట్ సినిమాకు హైలైట్ కానుంది . థమన్ ఇచ్చిన బాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి ఒక ప్లస్ పాయింట్.