బాలయ్య షో ఫై వర్మ కామెంట్స్

రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఎవర్ని ప్రశంస్తాడో ..ఎవర్ని ఎప్పుడు విమర్శిస్తాడో ఆయనకు కూడా తెలియదు. గత కొద్దీ రోజులుగా వైసీపీ సర్కార్ ఫై నిప్పులు చెరుగుతూ వస్తున్న ఈయన.సడెన్ గా మంగళవారం మెగా ఫ్యామిలీ ఫై పలు కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచాడు. ఇదిలా ఉండగానే తాజాగా బాలయ్య షో ఫై కామెంట్స్ చేసి మరోసారి వైరల్ గా మారాడు.

ఆహా ఓటీటీ వేదికపై అన్‌స్టాపబుల్‌ షో చేస్తున్నాడు బాలయ్య. ఈ షో కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలో వర్మ కన్ను ఈ షో ఫై పడింది. అన్‌స్టాపబుల్‌ విత్ ఎన్‌బీకే ప్రోగ్రామ్‌కు బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇచ్చారు. బాలయ్య బాబు హోస్ట్ చేస్తున్న ఈ షో అంటే తనకెంతో ఇష్టమని చెప్పిన ఆర్జీవీ.. ఇదో స్ట్రాటో ఆవరణ ప్రోగ్రామ్ అంటూ ఆకాశానికెత్తారు. అంతేకాదు తనకు కూడా ఆ షోలో పాల్గొనాలని ఉందంటూ ఓపెన్ అయ్యారు వర్మ. బాలకృష్ణ గారు నాకో అవకాశం ఇస్తారని ఆశిస్తున్నా అంటూ రామ్ గోపాల్ వర్మ పెట్టిన ట్వీట్ క్షణాల్లో వైరల్ అయింది.