నిర్మాతలకు వర్మ సంక్రాంతి విషెష్ ఎలా చెప్పాడో తెలుసా..?

రామ్ గోపాల్ వర్మ గత కొద్దీ రోజులుగా సినిమా టికెట్ ధరల విషయంలో ఏపీ సర్కార్ తో మాటల యుద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా సంక్రాంతి రోజున తనదైన శైలి లో ట్వీట్ చేసి వార్తల్లో నిలిచాడు. ‘సినీ నిర్మాతలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు కోరుకున్నట్టే టికెట్‌ ధరలు నిర్ణయించేలా, ప్లాప్‌ సినిమాలు తీసి పోగొట్టుకున్న డబ్బును.. ఏపీ ప్రభుత్వం వారికి ఇచ్చేలా చేయమని దేవుణ్ణి కోరుతున్నాను’ అని వర్మ వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు.

చిన్న సినిమాలు ‘బాహుబలి’ కంటే పెద్ద హిట్టవ్వాలని ఆకాంక్షించారు. ‘దేవుడు మీ అందరికీ ముఖేశ్‌ అంబానీ కంటే ఎక్కువ డబ్బు, పెద్ద ఇల్లు ఇవ్వాలి. ఎలాంటి వైర్‌సలూ సోకకుండా చూడాలి. యువతీ యువకులకు అందమైన జీవిత భాగస్వాములు దొరకాలని కోరుకుంటున్నా’ అని మరో ట్వీట్‌ చేశారు. ‘తమ ప్రవర్తన ఎలా ఉన్నా భార్యలు బాధించకుండా ఓకే చెప్పాలనే భర్తల కోరికను దేవుడు తీర్చాలి’ అంటూ ట్విటర్‌లో రాసుకొచ్చారు. ‘నన్ను ద్వేషించేవారికి సంక్రాంతి శుభాకాంక్షలు. నేను త్వరగా చనిపోవాలని కోరుకునే వారి కోరికను దేవుడు మన్నిస్తాడని కోరుకుంటున్నాను’ అని ట్వీట్‌ చేశారు.