లావణ్య త్రిపాఠి ను పెళ్లి చేసుకోబోతున్న వరుణ్ తేజ్ ..?

సోషల్ మీడియా పుణ్యమా అని వాస్తవాల కన్నా పుకార్లే ఎక్కువగా ప్రచారం అవుతున్నాయి. తాజాగా ఈరోజు మెగా పుకారు ఒకటి సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. మెగా హీరో వరుణ్ తేజ్ ..హీరోయిన్ లావణ్య త్రిపాఠి ని పెళ్లి చేసుకోబోతున్నాడని..పాతిక లక్షల విలువైన డైమండ్ రింగ్ తీసుకుని వరుణ్..ఈరోజు బెంగళూరు బయల్దేరి వెళ్లారని, అక్కడ లావణ్య కు పెళ్లి ప్రపోజ్ చేయబోతున్నారని తెగ ప్రచారం అవుతుంది.

ఈ ప్రచారాన్ని మెగా అభిమానులు లైట్ తీసుకుంటే..మరికొంతమంది మాత్రం నిజమే కావొచ్చు అన్నట్లు మాట్లాడుకుంటున్నారు. ఈరోజు ఈవెనింగ్ కల్లా ఈ వార్త ఫై క్లారిటీ రానుంది. ప్రస్తుతం వరుణ్ ..గని మూవీ తో బిజీ గా ఉంటె..లావణ్య మాత్రం చేతిలో ఏ సినిమాలు లేక ఖాళీగా ఉంది.