వెంకటేష్ 75 వ సినిమా అనౌన్స్మెంట్ !


విక్టరీ వెంకటేష్ ఎఫ్2 , నారప్ప, ఎఫ్ 3 సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు. కొత్త దర్శకులకు అవకాశమిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నాడు వెంకటేష్. ఇటీవలే ‘హిట్ 2’ తో భారీ హిట్‌ని అందించిన యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేష్ తన 75వ చిత్రాన్ని ప్రకటించాడు. శైలేష్ కొలను ఇంతకుముందే నాని హీరోగా ‘హిట్ 3’ ప్రకటించారు. ఇప్పుడు వెంకీ ప్రాజెక్ట్ ‘హిట్ 3’ తర్వాతనా లేక ఆ ప్రాజెక్ట్ రావడానికి ముందే కంప్లీట్ చేస్తారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

శైలేష్ కొలను డైరెక్షన్లో నిహారిక ఎంటర్టైన్‌మెంట్స్‌ పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి జనవరి 25 న ఒక అప్డేట్ వస్తుందని కి మేకర్స్ ప్రకటించారు. ఇక ఇందులో ఎవరెవరు నటిస్తున్నారో తెలియాలంటే మరో రెండు రోజు వేచిచూడాల్సిందే…