వెంకటేష్ హోస్ట్ గా ‘ఆహా’ అనిపించబోతున్నాడా..?

స్టార్ నటి నటులు ఇప్పటికే హోస్టులుగా మారి అభిమానులను , ప్రేక్షకులను అలరించగా..ఇప్పుడు ఫ్యామిలీ హీరో వెంకటేష్ సైతం హోస్ట్ గా మారబోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ‘ఆహా’లో ప్రసారమవుతున్న అన్‌స్టాపబుల్ టాక్ షోతో బాలకృష్ణ కూడా హోస్టుగా మారినసంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే అల్లు అరవింద్ ‘ఆహా’ కోసం ఓ సరికొత్త ఎంటర్‌టైనింగ్ ప్రోగ్రాంను ప్లాన్ చేస్తున్నారట. దీనికి వెంకటేశ్ హోస్ట్‌గా వ్యవహరించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇది ఎంతవరకు నిజమో తెలీదు గానీ.. వెంకీ అభిమానులు మాత్రం ఆయనను హోస్ట్‌గా చూడాలని తహతహలాడుతున్నారు. ఇక వెంకటేష్ ఈ మధ్య నటించినం నారప్ప , దృశ్యం 2 చిత్రాలు ఓటిటిలో విడుదలై అలరించాయి.