పవర్ఫుల్ గెటప్ తో హీరో వేణు రీఎంట్రీ !


స్వయంవరం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరో వేణు తొట్టెంపూడి. మొదటి సినిమాతో మంచి పేరు సంపాదించుకున్న వేణు ఆ తరువాత ఫామిలీ చిత్రాలు వరుసపెట్టి చేసుకుంటూ వెళ్ళాడు. అందులో వేణుకు పేరు తెచ్చిన సినిమాలు చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్, కల్యాణ రాముడు, పెళ్ళాం ఊరెళితే, గోపి గోపిక గోదావరి లు ముందు వరుసలో ఉంటాయి. ఆ తరువాత కొంత గ్యాప్ తీసుకొని ఎన్టీఆర్ నటించిన దమ్ము సినిమాలో నటించాడు కానీ ఆ తరువాత ఏమైందో మళ్ళీ సినిమాల వంక చూడలేదు.

తాజాగా రవితేజ నటిస్తున్న రామారావు ఆన్ డ్యూటీ చిత్రంలో పవర్ఫుల్ పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో వేణు చాలా కీలకమైన పాత్రను పోషించారు. ఆయన క్యారెక్టర్ పోస్టర్‌ ను విడుదల చేశారు నిర్మాతలు. ఈ పోస్టర్ లో సీఐ మురళిగా వేణు కాస్త సీరియస్‌ గా కనిపిస్తున్నారు. ఈ పాత్ర దాదాపు సినిమా మొత్తం రవితేజతో కలిసి ప్రయాణిస్తుంది. ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూలై 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది చిత్ర యూనిట్.