భవదీయుడు భగత్​ సింగ్ మూవీ లో విలన్ గా విజయ్ సేతుపతి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నడూ లేని విధంగా వరుస సినిమాలు చేస్తున్నారు. వాటిలో హరీష్ శంకర్ డైరెక్షన్లో భవదీయుడు భగత్​ సింగ్ ఒకటి. హరీశ్​శంకర్​-పవన్​కల్యాణ్​ కాంబోలో వచ్చిన ‘గబ్బర్​సింగ్​’ బ్లాక్ బస్టర్ ​హిట్​గా నిలిచింది. దీంతో ‘భవదీయుడు భగత్​సింగ్’​పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీలో పూజాహెగ్డే హీరోయిన్​గా నటించనుందని సమాచారం.

దేవీశ్రీ ప్రసాద్​ సంగీతమందించనున్నారు. కాగా ఈ మూవీ లో విలన్ గా తమిళ మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి ని అనుకుంటున్నారట. ఆయన పాత్రను ఎంతో వైవిధ్యంగా డిజైన్ చేశారట దర్శకుడు హరీశ్ శంకర్. దానివల్లనే ఇందులో నటించడానికి విజయ్ సేతుపతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. అతి త్వరలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం పవన్ ..భీమ్లా నాయక్ మూవీ ని పూర్తి చేసి , రిలీజ్ కు సిద్ధం చేసాడు. దీంతో పాటు హరిహర వీరమల్లు మూవీ సెట్స్ పైన ఉంది.