చియాన్ విక్రమ్ కి గుండెపోటు, అసలు జరిగింది ఇది …


ఈ రోజు మధ్యాహ్నం హీరో విక్రమ్ కి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో జాయిన్ చేసినట్లు వార్తలొచ్చాయి. ఎంతో ఫిట్ గా ఉండే చియాన్ విక్రమ్ కి గుండె పోటు రావడం ఏంటని తన అభిమానులు టెన్షన్ పడ్డారు. కానీ విక్రమ్ కి వచ్చింది గుండెపోటు కాదట. ఛాతిలో కాస్త నొప్పిగా అనిపిస్తే హాస్పిటల్ లో జాయిన్ చేశారట.

తాజాగా విక్రమ్‌ హెల్త్ పై కావేరి ఆసుపత్రి యాజమాన్యం మెడికల్‌ బుల్లెటిన్‌ విడుదల చేసింది. “విక్రమ్‌ చెస్ట్ పెయిన్‌తో ఆసుపత్రిలో చేరారని, అనుభవం ఉన్న ప్రత్యేక వైద్య బృందం ఆయనకు చికిత్స అందించారని వెల్లడించారు. ప్రస్తుతం విక్రమ్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఆయనకు జస్ట్ చెస్ట్ లో పెయిన్‌ వచ్చింది కానీ అది హార్ట్ ఎటాక్‌ లేదా కార్డియాక్ అరెస్ట్ కాదని అన్నారు. త్వరలోనే ఆయన్ని డిశ్చార్జి చేస్తామని విడుదల చేసిన బుల్లెటిన్‌ లో పేర్కొన్నారు“.