Site icon TeluguMirchi.com

‘రభస’లో వినాయక్ ?

vinayak-in-rabasa
ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం ‘రభస’. సంతోషం శ్రీనివాస్ దర్శకుడు. ఆగస్ట్ 29న రిలీజ్ కానున్న ‘రభస’ లో రోజుకో విశేషం వచ్చి చేరుతోంది. తాజాగా, రభసలో దర్శకుడు వి.వి. వినాయక్ వున్నాడన్న విషయం తేలిపోయింది. అదేదో పాత్రను పోషిస్తున్నాడుకుంటే పొరపాటే. ‘రభస’కు వినాయక్ వాయిస్ ఓవర్ అందిస్తున్నారు. వినాయక్ వాయిసే.. తారక్ ను తెరపై పరిచయం చేస్తుందట. రభసకు వినాయక్ వాయిస్ ఫ్లస్ కానున్నట్లు చిత్ర బృందం అంటోంది. తారక్ తో వున్న అనుబంధంతోనే వినాయక్ రభసకు గొంతిచ్చాడట. ఎన్టీఆర్ సరసన సమంత, ప్రణిత హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం థమన్. నిర్మాత బెల్లకొండ శ్రీనివాస్.

Exit mobile version