ప్రమాణ స్వీకారం చేసాడో లేదో మంచు విష్ణు మీడియా కు పెద్ద షాక్ ఇచ్చాడు

మా నూతన అధ్యక్షుడి గా ప్రమాణ స్వీకారం చేసిన మంచు విష్ణు మీడియా కు పెద్ద షాక్ ఇచ్చారు. ఎన్నికల సమయంలో మీడియా ను గట్టిగా వాడుకున్న విష్ణు..ఇప్పుడు మీడియా కు దూరంగా ఉంటానని చెప్పాడు. ఓ యేడాదితో తాము ఏం చేయబోతున్నామో చెప్పడానికి మాత్రమే మీడియా ముందుకు వస్తామని, ముగిసిన ఎన్నికల గురించి మాత్రం పెదవి విప్పమని అన్నారు. ‘మా’ గత అధ్యక్షులు నరేశ్ సైతం ఇకపై తాను మంచిని గురించి మాత్రమే మాట్లాడతానని, ఏదైనా విమర్శ తన దృష్టికి వస్తే మీడియాలో కాకుండా సంబంధితుల చెవిలో చెబుతానని తెలిపారు.

విష్ణుకి మా క్ర‌మ శిక్ష‌ణా సంఘం ఛైర్మ‌న్ కృష్ణంరాజు శుభాకాంక్ష‌లు తెలిపారు. అలాగే, మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీ నుంచి మోహ‌న్‌లాల్ కూడా అభినంద‌న‌లు తెలియ‌జేస్తూ వీడియో విడుద‌ల చేశారు. కార్య‌క్ర‌మంలో పాల్గొన్న మా మాజీ అధ్య‌క్షుడు సీనియ‌ర్ న‌రేశ్‌.. విష్ణుకి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌కు అన్న‌య్య‌లా వ్య‌వ‌హ‌రిస్తాన‌ని తెలిపారు.