యశ్ రాజ్ ఫిలిమ్స్ నుండి సమంత కు పిలుపు

యశ్ రాజ్ ఫిలిమ్స్ అంటే తెలియని సినీ ప్రేక్షకులు లేరు. ఈ బ్యానర్ లో ఒక్క సినేమైనా చేయాలనీ ప్రతి ఆర్టిస్ట్ కోరుకుంటుంటారు. ఇప్పటివరకు ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలు ఈ బ్యానర్ నుండి వచ్చి ప్రేక్షకులను అలరించాయి. అలాంటి ఈ బ్యానర్ నుండి సమంత కు పిలుపు వచ్చిందట.

‘ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్‌తో ఉత్తరాదిలోనూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది సమంత. ఈ క్రమంలో యష్ రాజ్ ఫిల్మ్స్ సమంతతో సినిమా కోసం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ సంస్థ ఒకేసారి మూడు సినిమాలు చేయమని సమంతను అడిగిందట. ఈ సూపర్ ఆఫర్ కి సమంత కూడా సానుకూలంగా స్పందించినట్లు వినికిడి. మరి ఆ సినిమాలు ఏంటి అనే విశేషాలు త్వరలో తెలియనుంది.