కారు ప్రమాదానికి గురైన ప్రముఖ నటి

ప్రముఖ నటి యాషిక ఆనంద్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. తమిళనాడు రాష్ట్రం చెంగల్‌పట్టు జిల్లా మామల్లాపురం సమీపంలో శనివారం అర్థరాత్రి ఒకటిన్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నటి యాషిక తీవ్ర గాయాలపాలు కాగా, ఆమెతో కలిసి ప్రయాణం చేస్తున్న హైదరాబాదీ అమ్మాయి భవాని (28) ప్రాణాలు కోల్పోయింది. ఈ కారులో మరో ఇద్దరు అబ్బాయిలు కూడా ఉన్నారని, వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 2016లో ‘దురువంగల్ పత్తినారు’ మూవీతో కోలీవుడ్‌ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 2018లో అడల్ట్ కామెడీ మూవీ ‘ఇరుట్టు అరైయిల్ మురట్టు’ సినిమాతో క్రేజీ స్టార్‌గా మారిన ఆమె బిగ్ బాస్ 2 తమిళ్ సిరీస్‌లో పాల్గొని ప్రేక్షకులకు బాగా చేరువైంది.