ఇరవై ఐదేళ్లుగా పురాణపండ ‘మంత్ర గణపతిని’ అందిస్తున్న అశోక్ కుమార్ జైన్

రాజమహేంద్రవరం : సెప్టెంబర్ : 3

కోస్తా జిల్లాల వర్తక సంఘాల సమాఖ్య అనగానే గుర్తుకొచ్చేమొదటిపేరు అశోక కుమార్ జైన్. సుమారు నాలుగైదు దశాబ్దాలపాటు రాజమహేంద్రవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో కీలకమైన వ్యక్తిగా … వర్తకులెవ్వరికి సమస్య వచ్చినా స్పందించి …పోరాటం చేసి గెలుపు జెండాని ఎగురవేసే పోరాట యోధునిగా అశోకే కుమార్ జైన్ పేరు వర్తక లోకానికి చిరపరిచయమని వేరే చెప్పఖ్ఖర్లేదు.

ప్రతీ ఏటా వినాయక చవితి వస్తే చాలు … అశోక్ కుమార్ జైన్ సమర్పణలో ఒక అత్యద్భుతమైన శ్రీ వినాయక చవితి స్పెషల్ బుక్ ఉభయగోదావరి జిల్లాలలో వేలమందికి మాంచి ఆకర్షణతో అందుతుంది. సుమారు ఇరువయ్యేళ్ళుగా రాజముండ్రి పరిసర ప్రాంతాల సాంస్కృతిక , సారస్వత , ధార్మిక , రాజకీయ రంగాల ప్రముఖులకు ఈ అపూర్వ గ్రంధాన్ని అందిస్తున్నారు అశోక్ కుమారు జైన్. ఈ సంవత్సరం ఇంకా ఆకర్షణీయంగా అనేక స్తోత్ర వైభవాలతో, అఖండ ఆకర్షణీయ అరుదైన చిత్రాలతో కూడిన శ్రీ వినాయక చవితి స్పెషల్ బుక్ ని తెలుగు రాష్ట్రాలలోని తలమానికంగా సమర్పించారు అశోక్ కుమార్ జైన్.

ఈ పరమ ప్రామాణికమైన పవిత్ర గణనాయకుని మంగళ గ్రంధానికి రచనసంకలనకర్తగా ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ వ్యవహరించడంతో … ఈ పుస్తక పరమశోభాయమానం వెనుక అకుంఠిత కృషి శ్రీనివాస్ అనేది నిస్సందేహంగా బయటపడే సత్యం. తెలుగు రాష్ట్రాలలో సంప్రదాయ గ్రంధాలను మంగళ కలశాలుగా అందించడంలో పురాణపండ శ్రీనివాస్ ది అందెవేసిన చెయ్యి. జీవన యాత్రలో ఎన్నో ఆటుపోట్లేదుర్కొన్నా … వెన్ను చూపక శ్రీనివాస్ చేస్తున్న పవిత్రకృషి అసాధారణమని పండిత పామరసమాజం కోడై కూస్తోందంటే ఆషామాషీ వ్యవహారం కాదు. తెలుగు రాష్ట్రాలలో శ్రీనివాస్ బుక్స్ కి వున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్వామీజీకి లేదని కూడా చెప్పాల్సిందే.

సృజనాత్మక మహా ప్రతిభతో ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ చేస్తున్న కృషికి ఈ విజయం దైవబలమేనని దేవాలయాల అర్చకులు, వేదపండితులూ సామూహికంగానే అభినందిస్తున్నారు. ఇప్పటికే ‘ నన్నేలు నాస్వామి ‘ ఆంజనేయ అఖండ మహాగ్రంధాన్ని అమిత్ షా ఆవిష్కరించి అభినందనలు వర్షించడం శ్రీనివాస్ ప్రజ్ఞావైభవానికి దైవానుగ్రహం ఎత్తిన పతాక. ముఖ్యంగా పుణ్య గోదావరీతీరంలోని సరస్వతీఘాట్ లో కొలువైవున్న సరస్వతీ దేవాలయ ప్రాంగణంలో ఈ మహిమోపేతమైన మంగళగ్రంధాన్ని ఈ ఉదయం ‘ నిన్నే సేవింతున్’ గా అశోక్ కుమార్ జైన్ ఆవిష్కరించడం ఎంతో శుభప్రదమని ఇస్కాన్ సంస్థ నిర్వాహకులు సైతం పురాణపండ కృషిని ప్రశంసించారు.

ఇంతటి మహోత్తమ కార్యానికి కారణభూతులైన శ్రీ సరస్వతీ దేవాలయ స్థాపకులు తోట సుబ్బారావుని అశోక్తో కుమార్ జైన్ పాటు భక్త సమాజం వేనోళ్ళ ప్రశంసిస్తోంది. భారతదేశ చరిత్రలో ఒక వినాయక చవితి పుస్తకాన్ని ఎంతో పరమశోభాయమానంగా, సనాతన సంప్రదాయాలతో , ఎన్నెన్నో గణపతి వైభవాలతో, విశేషాలతో విడుదలచేసి… లక్షలమందిని ఆకట్టుకున్న ముఖ్యులు పురాణపండ శ్రీనివాస్ మాత్రమే కావడం కేవలం సరస్వతీ దేవి సంపూర్ణ అనుగ్రహమేనని తోట సుబ్బారావు పురాణపండ శ్రీనివాస్ ప్రజ్ఞాధురీణతను కీర్తించారు. ఇప్పటికే పురాణపండ శ్రీనివాస్ ఏడువందల యాభై పేజీల ‘ శ్రీపూర్ణిమ ‘ అపురూప మహాగ్రంధం రాజమహేంద్రవరం కీర్తిని దేశాల ఎల్లలు దాటించిందని తిరుమల తీరు[పతి దేవస్థానం ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు మంగళాశాసనం చెయ్యడం మరో విశేషంగానే చెప్పాలి. ఇస్కాన్ ఆలయ ప్రతినిధుల ఆశీర్బలంతో, స్టాండర్డ్ ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్ చెన్నాప్రగడ శ్రీనివాస్ బాబు పర్యవేక్షణలో ఈ మంగళకార్యం జరగడం ముదావహం.