41 అడుగుల ధోనీ కటౌట్‌, హ్యాపీ బర్త్ డే ధోనీ !


అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్‌ ప్రకటించినప్పటికీ ధోనీ క్రేజ్‌ మాత్రం తగ్గలేదు. జులై 7 (గురువారం) ఎంఎస్‌ ధోనీ పుట్టినరోజు కావడంతో పుట్టినరోజు వేడుకులు ఘనంగా జరిపేందుకు అభిమానులు సిద్ధం అవుతున్నారు. ఈ సందర్భంగా విజయవాడలోని నందిగామ వద్ద 41 అడుగుల ధోనీ కటౌట్‌ ఏర్పాటు చేశారు ధోని అభిమానులు.