Site icon TeluguMirchi.com

విశ్వ విజేత ‘ఫ్రాన్స్‌’

ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ లో విశ్వ విజేత గా ‘ఫ్రాన్స్‌’ నిలిచింది. టోర్నీలో అజేయంగా దూసుకెళ్లిన ఫ్రాన్స్‌ చివరకు శిఖరాన నిలిచి సత్తా చాటింది. ఫైనల్‌ పోరులో అత్యద్భుత ఆట తీరు కనబర్చకపోయినా, తమ బలాన్ని నమ్ముకొని తెలివిగా, వ్యూహాత్మకంగా ఆడిన ఫ్రెంచ్‌ బృందం కూసింత అదృష్టం కూడా కలిసొచ్చి సంచలనాల క్రొయేషియాను ఆట కట్టించింది.

రెండో సారి వరల్డ్‌ కప్‌ విన్నర్‌గా నిలిచి తమ స్థాయిని ప్రదర్శించింది. మాస్కో లూజ్నికీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఫ్రాన్స్ 4-2 తేడాతో విజయం సాధించి 20 సంవత్సరాల తర్వాత విశ్వవిజేతగా నిలిచింది. ఈ మ్యాచ్ ఆరంభం నుంచి ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి.

Exit mobile version