Site icon TeluguMirchi.com

హైదరాబాద్ లో భారీ వర్షం..

హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం కుమ్మేసింది. రాత్రి 8 గంటల నుండి భారీ వర్షం కురుస్తూవస్తోంది. ఈ వర్షానికి ఎక్కడిక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. రోడ్లపై మోకాలి లోతు నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అమీర్‌పేట్, పంజాగుట్ల, యూసుఫ్‌గూడ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కేపీహెచ్‌బీ, ఖైరతాబాద్, ఉప్పల్, తార్నాక, బాలాగనర్, నాచారం తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కుండపోత వాన కురుస్తుండడంతో జనం ఇళ్ల నుంచి బయటికి రావొద్దని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచిస్తున్నారు.

Exit mobile version