దేశవ్యాప్తంగా జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో ప్రవేశ పరీక్షకు తేదీ ఖరారు

దేశ వ్యాప్తంగా ఉన్న జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో ప్రవేశ పరీక్షకు తేదీ నిర్ణయించారు.2021-2022 విద్యా సంవత్సరానికి గాను ఆరో తరగతి ప్రవేశాలకు ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఆగస్టు 11న అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎంట్రన్స్‌ పరీక్షను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ ప్రవేశ పరీక్ష కోసం దేశ వ్యాప్తంగా ఏకంగా 11,182 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణ సమయంలో అన్ని రకాల కోవిడ్‌ నిబంధనలను తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.2021-2022 విద్యా సంవత్సరానికి గాను మొత్తం 47,320 సీట్లను భర్తీ చేయనున్నారు.