Site icon TeluguMirchi.com

జయరామ్ హత్య వీడియో లభ్యం.. !

పారిశ్రామికవేత్త, ఎన్నారై జయరాం హత్యకేసు దర్యాప్తులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు రాకేష్‌రెడ్డి జయరాంను పథకం ప్రకారమే చంపినట్టు పోలీసులు గుర్తించారు. హత్యకు ముందు నిందితుడు చిత్రీకరించిన వీడియా లభ్యమైనట్టు తెలిసింది. ఖాళీ దస్తావేజులపై బలవంతంగా జయరాంతో సంతకాలు చేయిస్తున్న దృశ్యాలు అందులో ఉన్నట్టు
తెలుస్తోంది. గతంలోనే జయరాం తనకు ఆస్తులు స్వాధీనం చేశాడనేందుకు దస్తావేజులతోపాటు, వీడియో మరో బలమైన ఆధారమవుతుందనేది భావనతో రాకేష్ రెడ్డి ఈ వీడియోని చిత్రీకరించినట్టు పోలీసులు భావిస్తున్నారు.

జయరామ్ ని చంపడం వెనక రాకేష్ రెడ్డి ప్రధాన ఉద్దేశం.. ఆయన మొత్తం ఆస్తిని కాజేయడమే. అందుకే వీణ పేరుతో జయరామ్ ని ఆకర్షించి.. ఇంటికి రప్పించి.. చిత్రహింసలు పెట్టి.. ఆస్థి దస్త్రాలపై సంతకం చేయించుకొన్నాడు. ఆ తర్వాత జయరామ్ మరణం రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు పోలీసులకి దొరికిపోయి.. కటకటాలు లెక్కించబోతున్నాడు.

Exit mobile version