Site icon TeluguMirchi.com

పంచాయతీ కార్యదర్శి హాల్‌టికెట్లు వచ్చేసాయి..

తెలంగాణ రాష్ట్రంలో అక్టోబర్ 10 న జరగబోయే జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టుల రాతపరీక్షకు సంబందించిన హాల్‌టికెట్లను వెబ్ సైట్ లో పొందుపరిచారు. ఈ రాతపరీక్షకు దరఖాస్తు చేసుకున్న వారు తమ ఫోన్ నెంబర్, పుట్టినతేది వివరాలను నమోదుచేసి హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

అక్టోబర్ 8వ తేదీ వరకు ఈ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షకు హాజరయ్యేందుకు వచ్చే అభ్యర్థులు గుర్తింపు కార్డును తప్పకుండా తీసుకురావాలి. పాస్‌పోర్ట్, పాన్ కార్డు, ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు, గవర్నమెంట్ ఎంప్లాయర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్‌ల్లో ఏదైనా ఒక్కటి హాల్‌టికెట్‌తోపాటు వెంట తీసుకొని రావాలని తెలిపారు. ఇక మొత్తం 9,355 పోస్టులకు గాను 5,69,447 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ అక్టోబరు 10న రాతపరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్షలు ఉంటాయి.

Exit mobile version