Site icon TeluguMirchi.com

కమలానందకు 14 రోజుల జుడిషియల్ రిమాండ్

kamalananda bharathiస్వామి కమలానంద భారతిస్వామికి న్యాయమూర్తి పద్నాలుగు రోజుల జుడిషియల్ రిమాండ్ విధించారు. పోలీసులు ఆదివారం రాత్రి స్వామి కమలానందను శ్రీశైలంలో అరెస్టు చేసి ఇవాళ హైదరాబాద్‌కు తరలించారు. సోమవారం సంక్రాంతి సందర్భంగా సెలవు కావడంతో విచారణ అనంతరం కమలానందను పోలీసులు సికింద్రాబాద్‌లోని జడ్జి క్వార్టర్స్‌ లో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ప్రాథమిక విచారణ జరిపిన న్యాయమూర్తి స్వామికి పద్నాలుగు రోజుల జుడిషియల్ రిమాండ్ విధిస్తున్నట్టు తెలిపారు. దీంతో పోలీసులు కమలానందను చర్లపల్లి జైలుకు తరలించారు. ఆదివారం రోజున ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు వెళ్లిన స్వామి కమలానంద భారతిస్వామిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని మీర్‌చౌక్ పోలీసు స్టేషన్‌లో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై ఈనెల 8న ఇందిరాపార్కు వద్ద జరిగిన సమావేశంలో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారని కేసు నమోదైంది. దీంతో కమలానందను హైదరాబాద్ నుంచి వెళ్లిన సిట్ పోలీసు బృందం అదుపులోకి తీసుకున్నారు.

Exit mobile version