మహా బలాలకే మహాబలాన్నిచ్చే “శ్రీనివాస్ ” నృసింహం నా అదృష్టమన్న మంత్రి రోజా

Minister RK Roja

తిరుపతి : మే : 17

ద్వైత, విశిష్టాద్వైత , అద్వైత … ఈ మూడు సిద్ధాంతాలలో ఎవరి సిద్ధాంతం వారికున్నప్పటికీ , అందరూ ఇష్టపడే దైవం నృసింహ భగవానుడేనని , హైందవ సాంప్రదాయంలో ఆంజనేయుడు, నృసింహుడు లాంటి పేర్లు వింటేనే ఎంతో ధైర్యంగా ఉంటామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, యువజన సర్వీసుల శాఖామంత్రి శ్రీమతి ఆర్.కె.రోజా స్పష్టం చేశారు.

నగరిలో జరిగిన ఒక ప్రత్యేక ఉత్సవంలో ప్రముఖ రచయిత , ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధికారిక మాసపత్రిక ఆరాధన పూర్వ సంపాదకులు పురాణపండ శ్రీనివాస్ అపురూప రచన ‘ యుగే యుగే ‘ మంగళ గ్రంధాన్ని ఆమె ఆవిష్కరించి … ఎంతో మంది ముత్తయిదువులకు తానే స్వయంగా పంచారు.

ttd pradhana archakulu with puranapanda srinivas book

ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ ఈ అఖండ గ్రంధం నృసింహ కటాక్షంగా తాను సమర్పించగలిగానని, నరసింహావతారం ఉగ్రావతారం కాదని … ధర్మవిరుద్ధంగా వెళ్లేవారికి మాత్రమే స్వామి ఉగ్రుడని ప్రహ్లాద కథ ఎంతో అందంగా మనకి దర్శనమిస్తుడని పేర్కొంటూ లక్ష్మీ నృసింహుని కథని పెద్దలు చిన్నతనంనుండే పిల్లలకు తెలియజేస్తే ఎంతో వైభవం మనస్సుకు అల్లుకుంటుందని రోజా చెప్పారు. ఈ సందర్భంగా అక్కడకు విచ్చేసిన మహిళలకు ఆమె స్వయంగా భక్తినిండిన హృదయంతో ఈ చక్కని గ్రంధాన్ని పంచడం విశేషం. ఎంతో వైభవోపేతంగా తెలుగు గడపలకు సాహితీమిత్రులు పురాణపండ శ్రీనివాస్ ఒక యజ్ఞభావనతో చేస్తున్న నిస్వార్ధ పవిత్రగ్రంధ సేవ మామూలు విషయంకాదని ఆమె అభినందనలు వర్షించారు.

గత రెండేళ్లనాడు పరమరమణీయగ్రంధంగా పండితపామరులచే వేనోళ్ళ కొనియాడబడ్డ పురాణపండ శ్రీనివాస్ రచనాసంకలన అమృతకలశం ” శ్రీపూర్ణిమ ‘ అఖండ గ్రంధాన్ని కూడా రోజా ఎందరో ప్రముఖులకు సమర్పించి ప్రశంసలు పొందిన విషయం కూడా రసజ్ఞులకు ఎరుకే. శ్రీపూర్ణిమ దివ్య గ్రంధం చేసిన పవిత్ర సంచలనం అంతా ఇంతా కాదు.

వేంకటాచలక్షేత్ర ప్రధాన అర్చకులు వేణుగోపాలాచార్యులు సైతం రోజా ఆధ్యాత్మిక సేవను అభినందించడం మరొక విశేషంగా చెప్పక తప్పదు. ఇటు మంత్రిగా అనేకానేక ప్రయోగాత్మక ప్రభుత్వ కార్యక్రమాలలో చాలా ఉత్సాహంగా పాల్గొంటూ, ఇటు జీవితాన్ని చరితార్థం చేసే ఇలాంటి భక్తి రసాత్మక కార్యక్రమాలను నిర్మాణాత్మకంగా చేసి ఆదర్శత్వాన్ని నిరూపించారు రోజా.

తెలుగు లోగిళ్ళలో పురాణపండ శ్రీనివాస్ బుక్స్ నాణ్యతా ప్రమాణాలే ప్రత్యేకంగా వుంటాయని, నిస్వార్ధంగా చేయడంలో, అద్భుతంగా దైవీయ గ్రంధాలు అందించడంలో శ్రీనివాస్ కృషి అసాధారణమని , అపురూపమైన ఆయన శైలికి ఎంతోమంది సాహిత్య వేత్తలే ఆశ్చర్యపోతుంటారని ఏడేళ్లనాడు ఆచార్య సి. నారాయణరెడ్డి హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన ఒక గ్రంథావిష్కరణ సభలో పలుకులు నిజమని చెప్పి తీరాల్సిందే.

రోజమ్మ సమర్పించిన ఈ అపురూపమైన నృసింహ గ్రంధంలో 19 పేజీ నుండి 37 వరకు వున్నా నారసింహుని అవతార ఘట్టాన్ని శ్రీనివాస్ ఎంత అందంగా రాసారో అని తిరుమల వేదపాఠశాల విద్యార్థులు అభినందనలు వర్షిస్తున్నారు. ఇంతటి ఉత్తమ గ్రంధం సమర్పించిన రోజమ్మ మనస్సు ఎంతటి ఉన్నతమైనదో కదా. ఈ పుస్తకాన్ని ప్రతీ పేజీ ప్రశాంతంగా చూసిన వారెవరైనా సరే … పర్యాటక మంత్రి రోజమ్మా…! పదితరాలు వర్ధిల్లమ్మా ..!! అని తీరాల్సిందే. నో డౌట్ .

ఎప్పటిలానే పురాణపండ శ్రీనివాస్ తన గ్రంధాల ఆవిష్కరణకు తాను హాజరు కాలేదు.
కొన్నేళ్లుగా అద్భుత గ్రంధాలను నిస్వార్ధంగా అందిస్తున్న పురాణపండ శ్రీనివాస్ సమావేశాలకు, సభలకు, గ్రంథావిష్కరణకు చాలా దూరంగా వుంటున్నారు.