Site icon TeluguMirchi.com

ఈ ఏడాది మిస్ యూనివర్స్ పోటీలు ఎక్కడ జరుగుతాయో తెలుసా ?

ప్రతి ఏడాది జరిగే మిస్ యూనివర్స్ పోటీలు ఈ ఏడాది ఇజ్రాయెల్‌లో జరగనున్నాయి. ఈ ఏడాది జరగనున్నది 70వ ఎడిషన్‌ పోటీ కాగా, అది డిసెంబర్‌లో ఇజ్రాయెల్‌లోని రిసార్ట్‌ నగరం ఎలియాత్‌లో జరుగుతుందని మిస్‌ యూనివర్స్‌ సంస్థ మంగళవారం వెల్లడించింది. ప్రస్తుతం ప్రపంచ సుందరిగా ఉన్న మెక్సికో దేశస్తురాలు ఆండ్రియా మెజా కొత్త ప్రపంచ సుందరికి కిరీటాన్ని బహూకరిస్తారు. వీలైనంత ఎక్కువ మంది వ్యాక్సినేషన్‌ చేయించుకోవాలని తద్వారా మిస్‌ యూనివర్స్‌ 70వ ఎడిషన్‌ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం దక్కుతుం దని ఆ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది.

Exit mobile version